- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ వేలంలో రూ. 11 కోట్లు.. తొలిసారిగా స్పందించిన జితేశ్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలంలో భారత యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. 2022 వేలంలో పంజాబ్ అతన్ని కేవలం రూ.20 లక్షలకే దక్కించుకోగా.. ఈ సారి వేలంలో అతని విలువ భారీగా పెరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఏకంగా రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో భారీ ధర దక్కడంపై జితేశ్ తాజాగా స్పందించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు డబ్బు ముఖ్యం కాదని, క్రికెట్ ఆడటమే తన పని తెలిపాడు. ‘వేలంలో ఏం ఆశించలేదు. స్వేచ్ఛగా, నన్ను నేను నిరూపించుకునే జట్టులో మాత్రమే చేరాలని ప్రార్థించా. ఆర్సీబీ నాకు సరైన జట్టు. నా విలువ రూ.11 కోట్లు అనేది నాపై ఎలాంటి ఒత్తిడి కలిగించదు. ఆర్సీబీ నా పెట్టుకున్న నమ్మకం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.’ అని చెప్పాడు. అలాగే, కోహ్లీ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా ఉంటాడని, అతనితో ఆడటం వల్ల తన మెరుగుపర్చుకోవచ్చని తెలిపాడు. నిలకడగా రాణించడం, ఫిట్‌నెస్ విషయాలను కోహ్లీ నుంచి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.