ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు.. న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై రోహిత్ శర్మ..

by Vinod kumar |   ( Updated:2023-01-19 14:21:14.0  )
ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు.. న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై రోహిత్ శర్మ..
X

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 349 పరుగుల సాధించగా.. తర్వాత న్యూజిలాండ్ జట్టు 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మ్యాచ్ గెలిచినప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి చెయ్యి జారిందని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో బౌలర్ మహ్మద్ సిరాజ్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. మైఖెల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్ జోడీ భాగస్వామ్యాన్ని విడగొట్టడం తో టీమిండియా గెలవగలిగింది. 'నిజం చెప్పాలంటే బ్రేస్ వెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్ బాగా చేయగలిగితేనే గెలుస్తాము లేదంటే మ్యాచ్ చెయ్యి జారిపోతుందని మాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు అదే జరిగింది. టాస్ గెలిచాక మమ్మును మేము పరీక్షించుకోవాలనుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు' అని రోహిత్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed