ఇషాన్.. ఆడటం మొదలుపెట్టు : యువ క్రికెటర్‌కు రాహుల్ ద్రవిడ్ సూచన

by Harish |
ఇషాన్.. ఆడటం మొదలుపెట్టు : యువ క్రికెటర్‌కు రాహుల్ ద్రవిడ్ సూచన
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌తోపాటు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు అతన్ని సెలెక్టర్లు పక్కనపెట్టారు. మరోవైపు, అతను దేశవాళీలోనూ ఆడటం లేదు. దీంతో ఇషాన్ కిషన్‌పై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇషాన్ కిషన్‌కు టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక సూచన చేశాడు. అతను ఆడటం మొదలుపెట్టాలన్నాడు. ‘ఎవరికైనా తిరిగి రావడానికి మార్గం ఉంది. ఇషాన్ విశ్రాంతి కావాలని కోరాడు. మేము సంతోషంగా అతనికి విశ్రాంతినిచ్చాం. నేను అతన్ని దేశవాళీ క్రికెట్ ఆడాలని చెప్పలేదు. తిరిగి రావాలంటే కొంత ఆట ఉండాలని చెప్పాను. నిర్ణయం అతనిదే. అతన్ని మేము బలవంతం చేయడం లేదు. మేము అతనితో టచ్‌లో ఉన్నాం. అతను ఆడటం మొదలుపెట్టలేదు. కాబట్టి, అతన్ని పరిగణలోకి తీసుకోలేం.’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

అలాగే, వరుసగా నిరాశపరుస్తున్న తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా భరత్‌కు ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు.‘నిరాశపర్చడం అనేది చాలా పెద్ద పదం. నేను ఆ పదాన్ని వాడను. యువకులు మెరుగుపడటానికి సమయం పడుతుంది. అతను కీపింగ్ బాగా చేస్తున్నాడు. బ్యాటుతో మెరుగుపడాల్సి ఉంది.’ అని ద్రవిడ్ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed