- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మూడేళ్ల నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టెస్టుల్లో సెంచరీ చేసిన కోహ్లీ

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న నాలుగవ టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. గుజరాత్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత సెంచరీ చేసి భారత్‌ను అధిక్యం దిశగా తీసుకు వెళ్తున్నాడు. నాలుగవ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 241 బంతుల్లో కోహ్లీ వందల పరుగుల మార్క్ అందుకుని టెస్టుల్లో తన 28వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
అంతేకాకుండా రన్ మెషిన్ కోహ్లీ మూడు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత టెస్టుల్లో సెంచరీ సాధించాడు. విరాట్ చివరగా 2019లో కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ మార్క్ అందకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్న భారత్ అధిక్యం దిశ పయనిస్తోంది. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లీ 100, అక్షర్ 5 పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 400 పరుగులు చేసింది.