- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Mohammad Shami : మహ్మద్ షమీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?.. వారిద్దరేనట

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీ.. కోహ్లీ, ఇషాంత్‌తో తన అనుబంధం గురించి చెప్పాడు. ‘కోహ్లీ, ఇషాంత్ నా బెస్ట్ ఫ్రెండ్స్. నా గాయపడినప్పటి నుంచి కోలుకునే వరకు వారిద్దరూ నాకు రెగ్యులర్‌గా ఫోన్ చేసేవారు. నా రికవరీ గురించి చెక్ చేసేవారు.’ అని చెప్పాడు.
కాగా, చీల మండలం గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ ప్రస్తుతం కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను శుక్రవారం షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. షమీ చివరిసారిగా గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో కనిపించాడు. వరల్డ్ కప్‌లో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతను 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు.