- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Urvil Patel : IPL వేలంలో అన్‌సోల్డ్.. ఉర్విల్ పటేల్ మరో ప్రపంచ రికార్డు
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిన ఉర్విల్ పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటాడు. ఈ గుజరాత్ ఓపెనర్ ఆరు రోజుల వ్యవధిలో కేవలం 36 బంతుల్లో మరో సెంచరీ నమోదు చేశాడు. మంగళవారం ఉత్తరఖండ్‌తో ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ సెంచరీ బాదాడు. దీంతో 183 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 13.1 ఓవర్లలో చేధించింది. ఈ సెంచరీతో టీ20ల్లో 40 బంతుల్లోపే రెండు సెంచరీలు బాదిన తొలి బాట్స్‌మెన్‌గా ఉర్విల్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇదే గ్రౌండ్‌లో గత వారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ కేవలం 28 బంతుల్లో సెంచరీ బాదాడు. తద్వార టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 41 బంతుల్లో 115 పరుగులు చేసిన ఉర్విల్ 8 ఫోర్లు, 11 సిక్సులు బాది విధ్వంసం సృష్టించాడు. ఉర్విల్ పటేల్ విజృంభించడంతో గుజరాత్ మరో 41 బంతుల మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
26 ఏళ్ల ఈ యువ ఆటగాడిని ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. ఐపీఎల్-2024 సీజన్‌లో గుజరాత్ టైటన్స్ రూ.20లక్షలకు ఈ ఆటగాడిని దక్కించుకుంది. కానీ ఉర్విల్ పటేల్‌కు ఒక్క మ్యాచ్ ఆడే చాన్స్ రాలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఉర్విల్ 94 యావరేజ్‌తో 295 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఏకంగా 25 సిక్స్‌లు బాది అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగలడంపై ఉర్విల్ పటేల్ స్పందిస్తూ.. ‘ఏదైనా ఫ్రాంచైజీతో డీల్ కుదురుతుందని ఆశించాను. కానీ ప్రస్తుతం నా పర్ఫామెన్స్‌తో ఆటలో ముందుకు సాగడంపైనే దృష్టి సారించాను. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయకపోవడంపై నిరాశ చెందలేదు. అది నా చేతుల్లో లేదు.’ అని అన్నాడు.