U19 Asia Cup : నవంబర్ 30న పాకిస్తాన్‌తో తలపడనున్న భారత్

by Sathputhe Rajesh |
U19 Asia Cup : నవంబర్ 30న పాకిస్తాన్‌తో తలపడనున్న భారత్
X

దిశ, స్పోర్ట్స్ : అండర్ 19 అసియా కప్ 50 ఓవర్ల పురుషుల క్రికెట్ టోర్నీలో భాగంగా నవంబర్ 30 న పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు దుబాయ్, షార్జాలో జరగనున్న ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అనౌన్స్ చేసింది. ఇండియా తన గ్రూప్ ఏ మ్యాచ్‌ల్లో భాగంగా జపాన్, యూఏఈతో డిసెంబర్ 2, 4న షార్జాలో తలపడనుంది. గ్రూప్ ఏ, బీలలో టాప్‌లో నిలిచే రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. డిసెంబర్ 6న రెండు సెమీ ఫైనల్‌లు దుబాయ్, షార్జా వేదికగా జరగుతాయి. డిసెంబర్ 8న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, జపాన్, గ్రూప్‌-బీలో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, నేపాల్ ఉన్నాయి. నవంబర్ 29న టోర్నమెంట్ తొలి మ్యాచ్‌ బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మధ్య జరగనుంది. అదే రోజు శ్రీలంకతో నేపాల్ తలపడనుంది.

8 సార్లు టైటిల్ విజేతగా నిలిచిన భారత్

ఈ సారి జరిగే అండర్-19 ఆసియా 11వది కాగా, తొలిసారి బంగ్లాదేశ్‌లో 1989లో నిర్వహించారు. అండర్-19 2023 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో క్వాలిఫై కావడం ద్వారా జపాన్, నేపాల్, యూఏఈ ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. 2023లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యూఏఈపై 195 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు 8 టైటిల్స్ గెలుచుకుని ఇండియా టాప్‌లో ఉండగా.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు చెరొక సారి ఈ కప్ గెలుచుకున్నాయి. చివరిసారిగా జరిగిన మూడు టోర్నమెంట్లకు దుబాయ్‌ వేదికగా నిలిచింది. భారత్ చివరిసారిగా 2021లో అండర్-19 ఆసియా కప్ గెలుచుకుంది.

Advertisement

Next Story

Most Viewed