- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నరకం చూశా.. మళ్లీ బతికి వస్తాను అనుకోలేదు: స్టార్ క్రికెటర్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన ఆటతీరుతో టీమిండియా జట్టులో చక్కగా రాణిస్తున్నారు. ఒంటిచేత్తో ఎన్నో మ్యాచులను గెలిపించి సత్తా చాటారు. అయితే, ఏడాది క్రితం డిసెంబర్ 30న పంత్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని కాలులోని లిగమెంట్ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది.
యాక్సిడెంట్ కారణంగా గతేడాది క్రికెట్‌కు దూరమైన పంత్.. ఇటీవల ఐపీఎల్ సీజన్‌లో విజయవంతంగా రాణించారు. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. తాజాగా.. తనకు జరిగిన యాక్సిడెంట్‌ను, ఆ రోజులను తలుచుకొని బాధపడ్డారు. ఆ యాక్సిడెంట్ తన జీవితానికి చాలా నేర్పిందని అన్నారు. తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించిందని అన్నారు. ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించానని చెప్పారు. అది చాలా నరకంగా అనిపించిందని, అసలు మళ్లీ బతికి బయటకు వస్తానని, మళ్లీ క్రికెట్ ఆడుతానని అనుకోలేదని అన్నారు. ఏడు నెలల పాటు బ్రష్ కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ షోలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.