చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లా బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ ప్లేయర్

by Harish |
చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లా బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం సోషల్ మీడియా వేదికగా తమీమ్ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా కాలంగా దూరంగా ఉన్నా. ఆ దూరాన్ని తగ్గించలేం. అంతర్జాతీయ క్రికెట్‌లో నా అధ్యాయం ముగిసింది. చాలా కాలంగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీకి ముందు నేను ఆకర్షణగా నిలువాలనుకోవడం లేదు. అది జట్టు ఫోకస్‌ను దెబ్బతీస్తుంది. కెప్టెన్ శాంటో తిరిగి జట్టులోకి రావాలని కోరాడు. కానీ, నేను నా మనసు మాటే వింటాను.’ అని తమీమ్ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌‌కు తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండోసారి. 2023 జూలైలో వీడ్కోలు పలికాడు. కానీ, 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. తాజాగా తన నిర్ణయాన్ని తమీమ్ బుధవారమే సెలెక్టర్లకు తెలియజేశాడు. 2007లో ఇంటర్నేషన్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతను దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు. 35 ఏళ్ల తమీమ్ బంగ్లా తరపున 70 టెస్టుల, 243 వన్డేలు, 78 టెస్టులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో 15 వేలకుపైగా పరుగులు చేశాడు.


Advertisement
Next Story