అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్ బై

by Rajesh |
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్ బై
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ గెలవడంతో టీ-20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా సూపర్-8 దశలోనే వైదొలిగింది. దీంతో ఇండియాపై ఆస్ట్రేలియా నిన్న ఆడిన టీ-20 మ్యాచ్ వార్నర్‌కు చివరి మ్యాచ్ అయినట్లయింది. వార్నర్ తన చివరి వన్డేను ఇండియాపై వరల్డ్ కప్ ఫైనల్ లో ఆడాడు. 2024 జనవరిలో పాకిస్తాన్‌పై వార్నర్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అన్ని ఫార్మాట్లలో వార్నర్ 18,995 రన్స్ చేశాడు. అందులో 49 సెంచరీలు ఉన్నాయి. టీ-20 ఫార్మట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ ఉన్నాడు. మొత్తం 110 టీ-20 మ్యాచ్‌ల్లో వార్నర్ 3,277 పరుగులు చేశాడు. 161 వన్డేలు ఆడిన వార్నర్ 6,932 పరుగులు చేశాడు. 112 టెస్టు మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 8,786 పరుగులు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed