- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెట్స్‌లో చెమటోడ్చిన శ్రేయస్ అయ్యర్
ముంబై: వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమ్ ఇండియా సెమీస్ రేసులో ముందుంది. ముంబై వేదికగా గురువారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకపై నెగ్గితే సెమీస్ బెర్త్ దక్కినట్టే. సోమవారమే ముంబై చేరుకున్న భారత ఆటగాళ్లు మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నెట్స్‌లో చాలా సమయం గడిపాడు. ప్రపంచకప్‌లో అతని ప్రదర్శన కాస్త ఆందోళనకరంగానే ఉన్నది. వరుసగా 0, 25, 53, 19, 33, 4 పరుగులు చేశాడు. ఆరు మ్యాచ్‌ల్లో 33.5 సగటుతో 134 పరుగులు చేశాడు.
గత మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌పై సూర్యకుమార్(49) మంచి ఇన్నింగ్స్ ఆడటం, సెమీస్ నాటికి పాండ్యా అందుబాటులోకి రావడంతో జట్టులో అయ్యర్ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో మ్యాచ్‌లో అతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే శ్రేయస్ నెట్స్‌లో దాదాపు రెండు గంటలపాటు చెమటోడ్చాడు.
మరోవైపు, ఆప్షనల్ ట్రైనింగ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు పలువురు దూరంగా ఉన్నారు. కేవలం ఏడుగురు మాత్రమే పాల్గొన్నారు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ప్రాక్టీస్ చేశారు.