- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sheetal Devi: పారా ఒలింపిక్స్‌లో శీతల్‌దేవి వరల్డ్ రికార్ట్.. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశంసల జల్లు
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ పారా ఒలింపిక్స్‌లో కాంపౌండ్ యువ ఆర్చర్ శీతల్ దేవి త్రుటిలో ప్రపంచ రికార్డును చేజార్చుకుంది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో మొత్తం 703 పాయింట్లు సాధించిన శీతల్ రెండో ర్యాంక్‌తో ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. ఈ క్రమంలో ఫోబీ ప్యాటర్సన్ (698 పాయింట్ల) వరల్డ్ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తొలిసారి ఓ ఆర్చర్ విభాగంలో 700 పైగా పాయింట్లు సాధించిన భారత తొలి మహిళా ఆర్చర్‌గా శీతల్ సరికొత్త రికార్టును క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శీతల్‌దేవిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఆర్చర్ శీతల్‌దేవి 703 పాయింట్లతో పారిస్ పారా ఒలింపిక్స్‌లో అద్భుతం చేసింది. ఆమె దృఢ సంకల్పం.. ఆర్చరీ పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనం. అవిశ్రాంతమైన కృషి వల్లే ఆమె కలలు నిజమయ్యాయి. రేపటి బిగ్ మ్యాచ్‌కు ఆమెకు, మొత్తం జట్టుకు శుభాకాంక్షలు. నిజమైన ఛాంపియన్‌లు ఎప్పుడూ సాకులు చెప్పరని నిరూపించిన శీతల్‌కు, పారా అథ్లెట్లు అందరికీ నమస్కరిస్తున్నా.. వారు చరిత్ర సృష్టించారు’. అంటూ ట్వీట్ చేశారు.