- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
5G Network: దేశంలో 52 శాతానికి పెరిగిన 5జీ నెట్‌వర్క్ లభ్యత

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయడంతో దేశంలో సొంత 5జీ నెట్‌వర్క్ లభ్యత 52 శాతానికి చేరుకుందని ప్రముఖ నెట్‌వర్క్ టెస్టింగ్ సంస్థ ఓక్లా సోమవారం ప్రకటనలో తెలిపింది. దీనితో అత్యధికంగా 80 శాతం సొంత 5జీ లభ్యతతో అగ్రస్థానంలో ఉన్న చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచిందని ఓక్లా నివేదిక వెల్లడించింది. దీనర్థం 5జీ డివైజ్‌లను వాడుతున్న దేశీయ వినియోగదారులు తన నెట్‌వర్క్ వినియోగం 52 శాతం 5జీ నెట్‌వర్క్‌ను యాక్సెస్ పొందుతున్నారని నివేదిక వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని జియో కంపెనీ మొత్తం 17 కోట్ల 5జీ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు లభిస్తున్న కారణంగా ఎక్కువమంది కస్టమర్లు 5జీ స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. మరో ప్రైవేట్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సైతం 12 కోట్ల యూజర్లతో 5జీ కనెక్టివిటీని అందిస్తోంది. రిలయన్స్ జియో అందించే 40 శాతం వైర్‌లెస్ ట్రాఫిక్‌లో 5జీ వాటా ఉందని, త్వరలో 4జీ నెట్‌వర్క్‌ను అధిగమిస్తామని రిలయన్స్ ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ పేర్కొన్నారు.