చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు.. బెంగళూరు ముందు భారీ టార్గెట్

by Harish |   ( Updated:2024-02-29 15:50:01.0  )
చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు.. బెంగళూరు ముందు భారీ టార్గెట్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో ఢిల్లీ జట్టు బెంగళూరు ముందు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదట్లో శుభారంభం దక్కలేదు. ఓపెనర్, కెప్టెన్ మెగ్ లాన్నింగ్(11) స్వల్ప స్కోరుకే అవుటైంది. ఆ తర్వాత మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(50) హాఫ్ సెంచరీతో చెలరేగింది. దూకుడుగా ఆడిన ఆమె 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు చేసింది. ఆమెకుతోడు ఎలీస్ క్యాప్సే(46) సైతం మెరిసింది. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేసిన ఆమె తృటిలో అర్ధ సెంచరీ చేజార్చుకుంది. ఈ జోడీ రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం జెమిమా రోడ్రిగ్స్(0) నిరాశపర్చిన.. మారిజాన్నె కాప్(32), జొనాసెన్స్(36 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అరుంధతి రెడ్డి(10 నాటౌట్) అజేయంగా నిలిచింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసింది. బెంగళూర బౌలర్లలో సోఫి డివైన్, నాడిన్ డి క్లెర్క్ రెండేసి వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్‌కు ఒక్క వికెట్ దక్కింది.

Advertisement

Next Story