వరల్డ్స్ రిచెస్ట్ టి20 లీగ్‌కు సౌదీ ప్లాన్.. ఐపీఎల్ ఓనర్లను కోరిన గల్ఫ్ కంట్రీ

by Vinod kumar |
వరల్డ్స్ రిచెస్ట్ టి20 లీగ్‌కు సౌదీ ప్లాన్.. ఐపీఎల్ ఓనర్లను కోరిన గల్ఫ్ కంట్రీ
X

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఆర్థికపరంగా కావచ్చు లేదా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ పాల్గొనడం వల్ల కావచ్చు. లేదా అభిమానులకు ఈ టోర్నీపై ఎక్కువ మక్కువ కావచ్చు. అందుకే ఐపీఎల్‌కు ప్రపంచంలో మరే టీ20 లీగ్ సాటిరాదు. అయితే, త్వరలోనే ఇందులో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తమ దేశంలో ‘వరల్డ్ రిచెస్ట్ టీ20 లీగ్’ను నిర్వహించాలని ఐపీఎల్ ఓనర్లను సౌదీ అరేబియా సంప్రదించింది.

ఇప్పటికే ఫుట్‌బాల్, ఫార్ములా వన్ వంటి క్రీడల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్న సౌదీ అరేబియా కన్ను ఇప్పుడు క్రికెట్‌పై పడిందని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో జరిగే లీగ్స్‌లో పాల్గొనకూడదని భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆంక్షలు పెట్టింది. అయితే, తమ దేశంలో కొత్త టీ20 క్రికెట్ లీగ్ కోసం సౌదీ అరేబియన్ ప్రభుత్వం సంప్రదించడం చూస్తుంటే బీసీసీఐ నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఓ దినపత్రిక కథనం ప్రకారం, దాదాపు ఏడాది నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఏది జరగాలన్నా ముందుగా ఐసీసీ ఆమోదం కావాలి. క్రికెట్‌పై సౌదీ అరేబియా ఆసక్తి కనబరచడాన్ని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే ఇటీవలే ధ్రువీకరించారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story