- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇదంతా అతని వల్లే జరిగింది : అభిషేక్ శర్మ

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఇంగ్లాండ్‌తో ఐదో టీ20లో మెరుపు శతకం బాదిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. తన మెంటర్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. ‘యువీ పాజీ నన్ను నమ్మాడు. యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజ క్రికెటర్ ‘మీరు దేశానికి ఆడబోతున్నారు. జట్టును గెలిపిస్తారు’అని చెప్పినప్పుడు ఎవరైనా ‘నేను ఇండియాకు ఆడతాను. నా వంతు కృషి చేస్తాను’ అని ఆలోచిస్తారు. యువరాజ్, పంజాబ్ కోచ్ వసీమ్ అక్రమ్ నా క్రికెటింగ్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించారు. పోషిస్తున్నారు. కానీ, గతంలో చెప్పినట్టు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం యువరాజే. అతను ఎప్పుడూ నాతో ఉంటాడు. అతనే చెప్పే దాన్ని నేను వింటాను. అతనికి నా కంటే బాగా తెలుసు. అందుకే అతన్ని నేను నమ్ముతా.’ అని అభిషేక్ తెలిపాడు. ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన యువీ రికార్డును బ్రేక్ చేస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అది జరగకపోవచ్చని బదులిచ్చాడు. అయితే, సందర్భం వచ్చి ఆ పరిస్థితుల్లో ఉంటే అలాంటివి జరగొచ్చన్నాడు. అలాగే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా తనను ప్రోత్సహించారని చెప్పాడు. ఈ సిరీస్‌కు ముందు తాను గొప్పగా రాణించలేదని, అయినప్పటికీ వారు తనకు అండగా నిలిచారని గుర్తు చేశాడు. కచ్చితంగా పరుగులు చేస్తావని, నిన్ను నువ్వు నమ్ముకోవాలని సూచించారని తెలిపాడు.