- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sanjay Manjrekar: తుది జట్టు నుంచి నితీష్‌ను తప్పించండి.. సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024) లో భాగంగా ఆడిలైడ్ టెస్ట్ (Adelaide Test)లో భారత్ (India) 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా (Australia) 1-1తో సమం చేసింది. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత తుది జట్టు నుంచి యువ ఆల్‌రౌండర్, తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy)ని తప్పించాలని కామెంట్ చేశారు.
బౌలింగ్‌లో ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోతున్న నితీష్‌ను కేవలం బ్యాట్స్‌మెన్‌గా కొనసాగించడం కరెక్ట్ కాదన్నాడు. అతడు తుది జట్టులో ఉండటం వల్ల బౌలింగ్ అటాక్ పేలవంగా కనిపిస్తోందని సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) కామెంట్ చేశాడు. కాగా, ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలో వరుసగా 41, 38 నాటౌట్, 42, 42 పరుగులు సాధించాడు. అయితే, బౌలింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.