Sanjay Dutt: మరో క్రికెట్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన బాలీవుడ్ నటుడు..

by Vinod kumar |   ( Updated:2023-06-28 06:58:43.0  )
Sanjay Dutt: మరో క్రికెట్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన బాలీవుడ్ నటుడు..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ రోజుల వ్యవధిలోనే రెండు క్రికెట్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల కిందట జింబాబ్వే లీగ్‌లోని (జిమ్‌-ఆఫ్రో టీ10 లీగ్‌) హరారే హరికేన్స్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా లంక ప్రీమియర్‌ లీగ్‌లోని (శ్రీలంక టీ20 లీగ్‌) బి-లవ్‌ క్యాండీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.

తనతో పాటు ఒమర్‌ ఖాన్‌, షేక్‌ మర్వాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కలిసి బి-లవ్‌ క్యాండీ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్లు సంజూ ప్రకటించాడు. లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 జులై 30 నుంచి ఆగస్ట్‌ 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story