Sai Sudharsan : సాయి సుదర్శన్ సర్జరీ సక్సెస్.. ఫొటో షేర్ చేసిన ఆటగాడు

by Sathputhe Rajesh |
Sai Sudharsan : సాయి సుదర్శన్ సర్జరీ సక్సెస్.. ఫొటో షేర్ చేసిన ఆటగాడు
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ ఆటగాడు సాయి సుదర్శన్ సర్జరీ సక్సెస్ అయినట్లు మంగళవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా సుదర్శన్ బీసీసీఐ, గుజరాత్ టైటన్స్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘త్వరలోనే మరింత దృఢంగా క్రికెట్ ఆడతాను. బీసీసీఐ, మెడికల్ టీమ్‌కు బిగ్ థ్యాంక్స్. టైటన్స్ ఫ్యామిలీ.. మద్ధతు, ప్రేమకు కృతజ్ఞతలు.’ అని సాయిసుదర్శన్ పోస్ట్ చేశాడు. ఈ సర్జరీకి ముందు సుదర్శన్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా -ఏ తరఫున ఆడాడు. ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండో మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. తొలి టెస్టుకు ముందు భారత సీనియర్ల జట్టులో శుభమన్ గిల్‌కు గాయం కాగా ఆ స్థానానికి సుదర్శన్ పోటీకి పడ్డాడు. అయితే సెలక్టర్లు మాత్రం దేవదత్ పడిక్కల్‌కు చాన్స్ ఇచ్చారు.

Next Story

Most Viewed