సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్న సచిన్.. విషయం తెలిస్తే ‘వావ్’ అంటారు..!

by Javid Pasha |
సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్న సచిన్.. విషయం తెలిస్తే ‘వావ్’ అంటారు..!
X

దిశ, వెబ్ డెస్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఫ్యాన్స్ తో కలిసి సిల్వర్ జూబ్లీ సెలెబ్రేట్ చేసుకున్నారు. 25 ఏళ్ల కిందట (ఏప్రిల్ 22, 1998) ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యచ్ లో సచిన్ చిరస్మరణీయమైన సెంచరీ చేశారు. ఆసీస్ కు ఎదురులేని కాలంలో కంగారులను గ్రౌండ్ మొత్తం తిప్పిస్తూ సచిన్ సూపర్ సెంచరీ చేశారు. షేర్ వార్న్, మైకేల్ కాస్ప్రోవిజ్, టామ్ మూడీ, డేమియన్ ఫ్లెమింగ్ వంటి స్టార్ బౌలర్లకు సచిన్ చుక్కలు చూపించాడు. 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్కర్లతో 143 రన్స్ చేసి భారత్ కు మధురమైన విజయాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేక్ కట్ చేసిన అనంతరం సచిన్ మాట్లాడుతూ.. ‘‘25 ఏళ్ల కిందట ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నా. ప్రస్తుతం నాకు 50 ఏళ్లు. నా కూతురు సారాకు ౨౫, కుమారుడు అర్జున్ కు 23 ఏళ్లు. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. ఇన్నేళ్లకు ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు’’ అని సచిన్ తెలిపారు. కాగా ఎల్లుండి (ఏప్రిల్ 24) సచిన్ బర్త్ డే అనే విషయం తెలిసిందే.

Advertisement

Next Story