ప్రేయసిని పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్

by Mahesh |
ప్రేయసిని పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రాత్రి.. తన ప్రేయసి అయిన ఉత్కర్ష అమర్ పవార్‌ను మహాబలేశ్వర్‌లో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను గైక్వాడ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలకు క్యాఫ్షన్‌గా ఇలా రాసుకొచ్చాడు. "పిచ్ నుంచి బలిపీఠం వరకు, మా ప్రయాణం ప్రారంభమవుతుంది!" అని ఫన్నీగా రాసుకొచ్చాడు. కాగా రుతురాజ్ గైక్వాడ్ ప్రేయసి అయిన ఉత్కర్ష దేశవాళి క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించింది.

Advertisement

Next Story