Rohit Sharma: World Cup 2023 ఎఫెక్ట్.. సంచలన నిర్ణయం తీసుకున్న రోహిత్‌ శర్మ..?

by Prasanna |   ( Updated:2023-11-25 07:16:59.0  )
Rohit Sharma: World Cup 2023 ఎఫెక్ట్..  సంచలన నిర్ణయం తీసుకున్న రోహిత్‌ శర్మ..?
X

దిశ,వెబ్ డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత్‌ చివరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై.. రన్నరప్‌గా నిలిచింది. అన్ని మ్యాచ్ లు గెల్చుకుంటూ వెళ్లినా ఫైనల్ లో ఓడిపోవడం పై అభిమానులు నిరాశ చెందారు.ముఖ్యంగా టోర్నీలో జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ రోహిత్‌ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్న వీడియోలు కూడా బయటకి వచ్చాయి. వరల్డ్ కప్‌ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతర్జాతీయ టీ20లకు దూరమైన రోహిత్.. ఇక పూర్తిగా ఆ ఫార్మాట్‌ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌ 2023 ముందే రోహిత్‌ ఈ విషయం గురించి భారత చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు సైతం నాయకత్వ బాధ్యతలు వహిస్తాడని అంతా భావించారు. కానీ వర్క్‌ లోడ్‌ను తగ్గించుకునే క్రమంలో రోహిత్‌ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరంగా ఉందామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రోహిత్‌ శర్మ నిజంగానే టీ20లకు దూరమైతే మాత్రం.. కొత్త కెప్టెన్‌, కొత్త ఓపెనర్‌ను వెతకాల్సిందే. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు రోహిత్‌ శర్మను టీ20ల్లో కొనసాగాలని బీసీసీఐ కోరితే.. ఒప్పుకుంటాడా లేడా అన్నది చూడాలి. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు దూరమయ్యే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story