గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. రూ.3.60 కోట్లు పెట్టి కొన్న ఆటగాడు ఐపీఎల్‌కు దూరం

by Harish |
గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. రూ.3.60 కోట్లు పెట్టి కొన్న ఆటగాడు ఐపీఎల్‌కు దూరం
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆ జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ రాబిన్ మింజ్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా శనివారం ధ్రువీకరించాడు. జార్ఖండ్‌కు చెందిన రాబిన్ మింజ్ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. లీగ్‌లో ఏ దశలోనూ అతను కోలుకుని తిరిగి వచ్చే అవకాశం లేదని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. అతని స్థానాన్ని భర్తీ చేస్తారా?లేదా? అన్నది స్పష్టత ఇవ్వలేదు. ఐపీఎల్-2024 మినీ వేలంలో రాబిన్ మింజ్‌ను గుజరాత్ ఫ్రాంచైజీ భారీ ధర రూ.3.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కాగా, ఈ నెల 24న ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

Next Story