పంత్‌పై గంగూలీ ప్రశంసలు.. టెస్టుల్లో ఆల్‌ టైం గ్రేట్‌గా ఎదుగుతాడన్న దాదా

by Harish |
పంత్‌పై గంగూలీ ప్రశంసలు.. టెస్టుల్లో ఆల్‌ టైం గ్రేట్‌గా ఎదుగుతాడన్న దాదా
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు అతన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 2022లో జరిగిన కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత పంత్ ఆడేబోయే తొలి టెస్టు ఇదే. దూకుడైన ఆటతీరు, విదేశాల్లోనూ నిర్భయంగా ఆడే బ్యాటింగ్ శైలితో పంత్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రత్యేకంగా నిలిచాడు. తాజాగా పంత్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. భారత అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో పంత్ ఒకడని కితాబిచ్చాడు. ‘అతను తిరిగి టెస్టు జట్టులోకి రావడం నన్ను ఆశ్చర్యపర్చలేదు. భారత తరపున టెస్టులు ఆడటం కొనసాగిస్తాడు. పంత్ ఇలాగే రాణిస్తే టెస్టుల్లో ఆల్ టైం గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా ఎదుగుతాడు.’ అని ప్రశంసించాడు. అలాగే, వైట్‌‌బాల్ క్రికెట్‌‌లో మెరుగవ్వాలని పంత్‌కు సూచించాడు. అతనికి ఉన్న ప్రతిభతో భవిష్యత్తులో కచ్చితంగా అత్యుత్తమ క్రికెటర్‌ అవుతాడని జోస్యం చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed