- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IND VS AUS : 29 బంతుల్లోనే పంత్ హాఫ్ సెంచరీ.. పలు రికార్డులు బద్దలు
దిశ, స్పోర్ట్స్ : ఐదో టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 61 రన్స్ చేశాడు. అందులో 6 ఫోర్లు,4 సిక్స్‌లు ఉండటం విశేషం. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పలు రికార్డులు నెలకొల్పాడు. ఆసిస్ గడ్డపై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన పర్యాటక బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. దీంతో 50 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. గతంలో వెస్టిండీస్ ప్లేయర్ రాయ్ ఫ్రెడరిక్స్ పేరిట ఈ రికార్డు ఉండేది. 1975లో ఫ్రెడరిక్స్ పెర్త్‌లో 33 బంతుల్లో అర్ధ శతకం బాదగా.. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే, డేవిడ్ వార్నర్(17 బంతులు) తర్వాత ఆసిస్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. టెస్టుల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ రికార్డు పంత్ పేరిటే ఉన్నది. 2022లో శ్రీలంకపై 22 బంతుల్లో అర్ధ శతకం బాదాడు.అలాగే, సిక్సర్లలోనూ రిషబ్ రికార్డు సృష్టించాడు. ఆసిస్ గడ్డపై 13 సిక్స్‌లు కొట్టిన అతను అత్యధిక సిక్స్‌లు కొట్టిన పర్యాటక బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లు క్రిస్ గేల్, వివియన్ రిచర్డ్స్(12) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.