సమాజం నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నది చూడదు.. నీవల్ల ఇతరులు ఎంత హ్యాపీగా ఉన్నది అనేదే చూస్తుంది.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kavitha |
సమాజం నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నది చూడదు.. నీవల్ల ఇతరులు ఎంత హ్యాపీగా ఉన్నది అనేదే చూస్తుంది.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు.

సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది. ప్రెజెంట్ నిర్మణ రంగంలోకి అడుగుపెట్టి శుభం సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. సమంత నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ‘ఏ నది కూడా తమ దాహం తీర్చుకోవడం కోసం వాటి నీటిని తాగవు.. అలాగే చెట్లు కూడా తమకు కాసే పళ్లను తినలేవు..

సూర్యుడు కూడా అంతే తన కోసం కాంతిని ప్రకాశింపడు.. పువ్వులు కూడా తమ పరిమళాన్ని తమ కోసమే ఉపయోగించవు.. ఆ విధంగా మనం కూడా పుట్టింది ఇతరులకు హెల్ప్ చేయడం కోసమే. సమాజం మనం ఎంత హ్యాపీగా ఉన్నామనేది చూడదు.. కానీ నీ వల్ల ఇతరులు ఎంత హెల్ప్ చేయబడ్డారనేది చూస్తుంది’ అని పోప్ ప్రాన్సిక్ చెప్పిన డైలాగ్‌‌ను రాసుకొచ్చింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.




Next Story

Most Viewed