ఏంటి.. న్యూయార్క్ ఇంత గలీజ్‌గా ఉంటుందా? అటు వెళితే ముక్కు మూసుకోవాల్సిందే!

by D.Reddy |   ( Updated:2025-04-24 09:04:47.0  )
ఏంటి.. న్యూయార్క్ ఇంత గలీజ్‌గా ఉంటుందా? అటు వెళితే ముక్కు మూసుకోవాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోని ఫేమస్ నగరాల్లో న్యూయార్క్ (Newyork) ముందువరుసలో ఉంటుంది. నిత్యం పర్యాటకులు, ఉద్యోగస్థులు, వ్యాపారస్థులతో రద్దీగా ఉంటుంది. అమెరికా వెళ్లిన టూరిస్టులు ఎవరైనా తప్పనిసరిగా న్యూయార్క్‌ చూడకుండా అస్సలు రారు. ఎందుకంటే.. అమెరికా ఐకాన్‌గా పేరొందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (Statue of Liberty), 5th ఎవెన్యూ, బ్రూక్లిన్ బ్రిడ్జ్, టైమ్స్ స్వ్కేర్ వంటి అందమైన పర్యాటక ప్రదేశాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే, ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.. న్యూయార్క్‌‌లో పరిశుభ్రత (Cleanliness in New York) అత్యంత దారుణంగా ఉంటుంది. నమ్మకలేకపోతున్నారు కదా.. అయితే ఈ వీడియో చూడండి.

ఢిల్లీకి చెందిన యూట్యూబర్ లవ్ సోలంకి రుద్రాకాష్ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఈ విశేషాలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ను షేర్ చేశాడు. అందులో న్యూయార్క్‌లో సబ్‌వేలు ఎంత దారుణంగా ఉంటాయో చూపించాడు. భారత్‌లోని స్లమ్స్ కంటే అధ్వానంగా ఉన్నాయని, మెట్రో స్టేషన్‌లో ఎక్కడ చూసిన మానవ వ్యర్థాలు, ఎలుకలతో కంపుకొడుతుందని తెలిపాడు. ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు.



Next Story

Most Viewed