WTC Final భారత్ గెలవాలంటే.. అతనిపైనే ఆధారపడి ఉంది : రికీ పాంటింగ్

by Vinod kumar |
WTC Final భారత్ గెలవాలంటే.. అతనిపైనే ఆధారపడి ఉంది : రికీ పాంటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో గెలవాలంటే భారత పేసర్లు రాణించాల్సిన అవసరం ఉందని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ అన్నారు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత పేస్ దళానికి వెటరన్ మహమ్మద్ షమీ నాయకత్వం వహిస్తున్నాడు. భారత్ గెలవాలంటే షమీ తప్పనిసరిగా రాణించాల్సిన అవసరం ఉందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. 'మహమ్మద్ షమీ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి.. తన ఆటను మరో స్థాయికి తీసుకెళ్తే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం సులభం. కొత్త బంతితో అయినా.. బంతి పాతబడిన తర్వాత అయినా సరే.. షమీ చాలా ప్రమాదకరం. అది ఇండియాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా' అని పాంటింగ్ పేర్కొన్నాడు.

Next Story

Most Viewed