- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాహుల్ ద్రవిడ్‌కు గాయం

- కోలుకొని జట్టుతో చేరాడని ఆర్ఆర్ ప్రకటన
దిశ, స్పోర్ట్స్: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయపడ్డాడు. బెంగళూరులో క్రికెట్ ఆడుతుండగా ఎడమ కాలికి గాయమైంది. అయితే ప్రస్తుతం ద్రవిడ్ గాయం నుంచి కోలుకున్నాడని.. బుధవారం రాత్రే జట్టుతో జాయిన్ అవుతాడని రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా ఆర్ఆర్ జట్టు ట్రైనింగ్ సెషన్‌కు దూరమయ్యాడు. మెగా ఆక్షన్‌కు ముందే ద్రవిడ్‌ను ఆర్ఆర్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. అయితే గాయం కారణంగా అతను ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనలేకపోయాడు. అయితే మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ద్రవిడ్ జట్టుతో చేరనున్నట్లు ఆర్ఆర్ ప్రకటించింది. రాబోయే పది రోజులు ద్రవిడ్ జట్టు ట్రైనింగ్ సెషన్‌లో ఉంటాడని పేర్కొంది. ఇటీవల కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) గ్రూప్ 3 లీగ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ విజయ్ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్ కుమారుడు అన్వయ్ కూడా ఆడటం విశేషం. ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో 29 పరుగులు చేసిన ద్రవిడ్.. కాలు గాయం కారణంగా మైదానం వీడాడు. కాగా, ఆర్ఆర్ డైరెక్టర్ కుమార సంగక్కర, కెప్టెన్ సంజూ శాంసన్‌తో కలిసి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఏడాది జట్టు విజయాల కోసం ప్రత్యేక వ్యహాలు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. ఐపీఎల్ తొలి విజేత అయిన ఆర్ఆర్ 17 ఏళ్ల తర్వాత మరోసారి చాంపియన్ కావాలని ఎదురు చూస్తోంది.