గ్రాండ్‌గా ప్రారంభం అయిన ప్రో కబడ్డి లీగ్.. మొదటి మ్యాచ్ Telugu Titans vs Bengaluru Bulls

by Mahesh |
గ్రాండ్‌గా ప్రారంభం అయిన ప్రో కబడ్డి లీగ్.. మొదటి మ్యాచ్ Telugu Titans vs Bengaluru Bulls
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశం మొత్తం కబడ్డీ ఆటకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ప్రో కబడ్డీ లీగ్.. ఆ క్రేజ్ ను మరింత పెంచింది. ఈ లీగ్ ప్రారంభం అయిన మొదటి సీజన్ నుంచి తన ప్రేక్షకులను పెంచుకుంటు.. ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రో కబడ్డి లీగ్ 11వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సీజన్ లోని మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మొదటి మ్యాచ్ కు సంబంధించిన ఓపెనింగ్ సెర్మని గ్రాండ్‌గా జరిగింది. అయితే గత సీజన్ లో కీలక ప్లేయర్లు ఉన్నప్పటికి పేలవమైన ఆటతీరును కనబరిచిన తెలుగు టైటాన్స్ .. ఈ సీజన్ లో అయిన రాణిస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది మరి..

ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ జట్టులో

డిఫెండర్లు: క్రిషన్, మిలాద్ జబ్బారి, మహమ్మద్ మలాక్

ఆల్‌రౌండర్లు: విజయ్ మలిక్, అమిత్ కుమార్

రైడర్లు: మంజీత్, ఆశీష్ నర్వాల్ ను టైటాన్స్

కొత్త కోచ్: కిషన్ కుమార్ హోదా

కెప్టెన్ పవన్ సెహ్రావత్

Advertisement

Next Story

Most Viewed