Paris Olympics: హాకీలో భారత్‌కు కాంస్యం.. ఆ రాష్ట్ర ఆటగాళ్లకు భారీ నజరానా

by Harish |
Paris Olympics: హాకీలో భారత్‌కు కాంస్యం.. ఆ రాష్ట్ర ఆటగాళ్లకు భారీ నజరానా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. బ్రాంజ్ మెడల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2-1 తేడాతో నెగ్గి పతకం కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భారీ నజరానా ప్రకటించారు. రూ. కోటి క్యాష్ ప్రైజ్ అందజేయనున్నట్టు తెలిపారు. ‘కాంస్యం సాధించిన భారత హాకీ జట్టుకు అభినందనలు. అపూర్వ విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్‌ సహా పంజాబ్‌కు చెందిన 10 మంది ఆటగాళ్లు ఉండటం మరింత గర్వంగా ఉంది. పంజాబ్ ఆటగాళ్లకు రూ. కోటి అందజేస్తాం.’అని సీఎం భగవంత్ మాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed