- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ టోర్నీలో 60 ఏళ్ల తర్వాత కూడా పాక్‌పై మనదే పైచేయి
దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 60 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిన భారత డేవిస్ కప్ జట్టు సంచలనం సృష్టించింది. రెండు రోజులపాటు ఇస్లామాబాద్‌లో జరిగిన వరల్డ్ గ్రూపు-1 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో 4-0 తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆదివారం డబుల్స్ మ్యాచ్‌లో యుకీ బాంబ్రీ-సాకేత్ మైనేని జోడీ నెగ్గడంతో భారత్ విజయం లాంఛనమైంది. దీంతో డేవిస్ కప్‌లో భారత్ వరల్డ్ గ్రూపు-1కు అర్హత సాధించింది. శనివారం సింగిల్స్ మ్యాచ్‌ల్లో రామనాథన్ రామ్‌కుమార్, శ్రీరామ్ బాలాజీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మొదటి రోజు 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో యుకీ బాంబ్రీ-సాకేత్ మైనేని ద్వయం 6-2, 7-6(7-5) తేడాతో పాకిస్తాన్‌కు చెందిన ముజామిల్ ముర్తాజా-అకీల్ ఖాన్ ద్వయాన్ని ఓడించింది. ఈ విజయంతో భారత్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఇక, నామమాత్రపు నాలుగో మ్యాచ్‌లో భారత సింగిల్స్ ప్లేయర్ నికి పూనాచా అరంగేట్ర డేవిస్ కప్ మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. పాక్ ప్లేయర్ ముహమ్మద్ షోయబ్‌పై 3-6, 4-6 తేడాతో విజయం సాధించాడు. దీంతో భారత్ 4-0తో ఆధిక్యంలో నిలువగా నామమాత్రపు ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఈ విజయంతో భారత్ టోర్నీలో వరల్డ్ గ్రూపు-1కు అర్హత సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మ్యాచ్ జరగనుంది. డేవిస్ కప్‌లో పాక్‌తో ఇప్పటివరకు మొత్తం 8సార్లు తలపడగా భారత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇంతకుముందు 1964లో భారత జట్టు పాక్‌లో పర్యటించగా.. అప్పుడు కూడా 4-0తోనే విజయం సాధించింది. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాక్‌కు వెళ్లలేదు. 2019లో తటస్థ వేదికపై మ్యాచ్ జరిగింది. ఈ సారి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ తటస్థ వేదికకు అనుమతించలేదు. దీంతో 60 ఏళ్ల తర్వాత దాయాదీ దేశంలో అడుగుపెట్టిన భారత్ పాక్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.