Olympics: పారిస్ ఒలంపిక్స్ బాక్సింగ్ వివాదం వేళ ఐఓసీ సంచలన ప్రకటన

by Ramesh Goud |
Olympics: పారిస్ ఒలంపిక్స్ బాక్సింగ్ వివాదం వేళ ఐఓసీ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పారిస్ ఒలంపిక్స్ బాక్సింగ్ వివాదం ముదురుతున్న వేళ అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ కీలక ప్రకటన చేసింది. వివక్ష లేకుండా ప్రతి వ్యక్తికి క్రీడలను అభ్యసించే హక్కు ఉందని తెలుపుతూ.. మహిళల ఈవెంట్‌లో పాల్గొనేందుకు పురుషుల XY క్రోమోజోమ్‌లతో కూడిన బాక్సర్‌ను అనుమతిస్తున్నట్లు ఐఓసీ ప్రకటించింది. అంతేగాక అల్జీరియా బాక్సర్ ఇమానే ఎదుర్కొంటున్న దుర్వినియోగం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. పారిస్ ఒలంపిక్స్2024 బాక్సింగ్ విభాగంలో అర్హత ప్రమాణాలను నిర్ణయించే అంశంలో ఇంటర్నేషన్ బాక్సింగ్ అసోసియేషన్ ను ఐవోసీ పక్కన పెట్టింది. దీనికి బదులుగా పారిస్ 2024 బాక్సింగ్ యూనిట్ పై ఆధారపడుతుంది. కాగా పారిస్ ఒలంపిక్స్ 2024 బాక్సింగ్ మహిళల విభాగంలో గురువారం జరిగిన మ్యాచ్ లో వివాదం చోటుచేసుకుంది.

అల్జీరియా బాక్సర్ ఇమానే ఖలీప్ తో ఇటలీకి చెందిన ఏంజెలా కారిని తలపడింది. మ్యాచ్ ప్రారంభం అయిన 46 సెకండ్లకే ఏంజెలా బాక్సింగ్ రింగ్ నుంచి వాకౌట్ చేసింది. ఆమె ఒక పురుషుడితో తలపడటం ప్రమాదకరం అని భావించి, పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో మ్యాచ్ పూర్తి కాకాముందే ఇమానే ఖలీఫ్ ను విజేతగా ప్రకటించారు. దీంతో ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించిన ఇమానే ఖలీఫ్‌ను పారిస్ ఒలంపిక్స్ కు సెలెక్ట్ చేయడంపై క్రీడా వర్గాల్లో దుమారం రేగుతోంది. లింగ నిర్ధారణలో పురుషుడిగా తేలిన బాక్సర్ తో మహిళను ఆడించడం పట్ల ఒలంపిక్స్ కమిటీ పై విమర్శలు వెళ్లువెత్తున్నాయి. దీనిపై శుక్రవారం ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కమిటీ స్పందిస్తూ.. మహిళల ఈవెంట్‌లో పాల్గొనేందుకు పురుషుల XY క్రోమోజోమ్‌లతో కూడిన బాక్సర్‌ను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed