- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
NZ vs PAK : న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ పర్యటనలోనూ షాక్ తగిలింది. తొలి టీ20లో కివీస్ చేతిలో చిత్తుగా ఓడింది. క్రిస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పూర్తిగా తేలిపోయింది. కివీస్ బౌలర్లు జాకబ్ డఫీ 4 వికెట్లు, జేమీసన్ 3 వికెట్లతో విజృంభించగా.. ఇష్ సోధి 2 వికెట్లతో రాణించాడు. దీంతో పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. ఖుష్‌దిల్(32) మాత్రమే పర్వాలేదనిపించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. ఇద్దరు డకౌటయ్యారు. ఇక, 92 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 10.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. టిమ్ సీఫెర్ట్(44) సత్తాచాటగా.. ఫిన్ అలెన్(29 నాటౌట్), టిమ్ రాబిన్సన్(18 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
- Tags
- NZ vs PAK