- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
డేవిస్ కప్ నుంచి జకోవిచ్ ఔట్
![డేవిస్ కప్ నుంచి జకోవిచ్ ఔట్ డేవిస్ కప్ నుంచి జకోవిచ్ ఔట్](https://www.dishadaily.com/h-upload/2025/01/29/416264-tennis-ausopen-djokovic-017381490937021738149138153.webp)
- స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగుతున్న సెర్బియా
- ఇంకా మానని హామ్‌స్ట్రింగ్ గాయం
- ఫ్రెంచ్ ఓపెన్ నాటికి కోలుకునే అవకాశం
దిశ, స్పోర్ట్స్:
స్టార్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ తొడ కండరాల (హామ్‌స్ట్రింగ్) గాయం మరింతగా ముదిరడంతో ఆటకు మరి కొన్ని రోజులు దూరం కానున్నాను. డేవిస్ కప్ ఆడే సెర్బియా జాతీయ జట్టుకు అతను ఈ సారి ప్రాతినిథ్యం వహించబోడని, డెన్మార్క్‌తో జరుగనున్న మ్యాచ్‌లో జకోవిచ్ లేకుండా జట్టు బరిలోకి దిగుతుందని తెలిసింది. ఈ నెల మొదట్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ గాయపడ్డాడు. కార్లోస్ అల్కరాజ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో గెలిచినా.. అలెగ్జాండర్ జ్వెరేవ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో గాయం తీవ్రంగా మారడంతో అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జకోవిచ్.. ఇంకా హామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకోలేదని తెలిసింది. దీంతో శుక్రవారం నుంచి డెన్మార్క్‌తో జరగనున్న డేవిస్ కప్ తొలి రౌడ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ లేకుండానే సెర్బియా బరిలోకి దిగనుంది. జకోవిచ్‌తో పాటు డుసాన్ లాజోవిక్ కూడా గాయంతో వైదొలగడంతో ప్రస్తుతం సెర్బియా తరపున మయోమెర్ మినమెక్, హమాద్ మెదెదోవిక్, డబుల్స్ స్పెషలిస్ట్స్ సెబనోవా బ్రదర్స్, మాతెజ్, ఇవాన్ బరిలో దిగనున్నారు. కాగా, జకోవిచ్‌కు రెండు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు ఈఎస్‌పీఎన్ రిపోర్టు చేసింది. అలాగే సన్‌షైన్ డబుల్స్, ఇండియన్ వెల్స్, మియామీ మాస్టర్స్‌కు కూడా అందుబాటులో ఉండడని పేర్కొంది. మే 25 నుంచి ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ నాటికి కోలుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.