మహ్మద్ షమీ‌ రిటైర్‌మెంట్‌పై టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |
మహ్మద్ షమీ‌ రిటైర్‌మెంట్‌పై టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 2018లోనే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాల‌ని అనుకున్నాడ‌ని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రవిశాస్త్రి సలహాతో రిటైర్‌మెంట్‌ అవ్వాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలిపాడు. వ్యక్తిగ‌త జీవ‌తంలో పాటు ఫిట్‌నెస్ ప‌రంగా స‌మ‌స్యలు ఎదుర‌వ్వడంతో ష‌మీ రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకున్నాడ‌ు. కానీ, ర‌విశాస్త్రి సూచనతో ష‌మీ మ‌న‌సును మార్చామ‌ని చెప్పాడు. 2018లో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లేముందు నిర్వహించిన ఫిట్‌నెస్ ప‌రీక్షలో ష‌మీ విఫ‌ల‌మ‌య్యాడు. దాంతో టీమ్ నుంచి అత‌డిని ప‌క్కన‌పెట్టాల్సివ‌చ్చింది. ఈ విషయాలు తనతో షమీ పంచుకున్నట్లు భరత్ అరుణ్ తెలిపాడు.

రిటైర్‌మెంట్ ఆలోచ‌న‌ను ప‌క్కన‌పెట్టి బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడెమీకి వెళ్లి ట్రైనింగ్ తీసుకోమ‌ని సలహా ఇవ్వడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని.. మా స‌ల‌హాను పాటించి ఐదు వారాల పాటు ఎన్‌సీఏలో శ్రమించిన ష‌మీ ఫిటెనెస్ సామ‌ర్థ్యాన్ని పెంచుకున్న ష‌మీ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడ‌ని భ‌ర‌త్ అరుణ్ పేర్కొన్నాడు. ఇటీవ‌లే ఆస్ట్రేలియాలో జ‌రిగిన తొలి టెస్ట్‌లో ఆల్‌రౌండ్ ప్రద‌ర్శన‌తో షమీ ఆక‌ట్టుకున్నాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీయ‌డ‌మే కాకుండా బ్యాటింగ్‌లో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 37 ర‌న్స్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed