Manu Bhaker : మను బాకర్‌కు రూ. 30 లక్షల నజరానా

by Harish |
Manu Bhaker : మను బాకర్‌కు రూ. 30 లక్షల నజరానా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. బుధవారం ఆమె ఇండియాకు తిరిగి రాగా అభిమానులు ఢిల్లీలో ఘన స్వాగతం పలికారు. గురువారం మను కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా‌ను కలిసింది. చారిత్రాత్మక విజయం సాధించిన మనును కేంద్ర మంత్రి అభినందించారు.

దేశం మొత్తం ఆమెను చూసి గర్విస్తోందని, మను సాధించిన విజయం భారత క్రీడా ప్రపంచంలోని యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. అలాగే, రూ. 30 లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందజేశారు. కాగా, ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు మూడు పతకాలు దక్కాయి. ఆ మూడు షూటింగ్‌లోనే వచ్చాయి. ఆ మూడింటిలో రెండు పతకాలు మను సాధించినవే కావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను బాకర్ దేశానికి తొలి పతకం అందించింది. అలాగే, అదే విభాగంలో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మరో బ్రాంజ్ మెడల్ గెలిచింది.

Advertisement

Next Story

Most Viewed