రోహిత్ షాకింగ్ డెసిషన్.. ఆ పొజిషన్‌ను రాహుల్ కోసం త్యాగం చేసిన హిట్‌మ్యాన్

by Harish |
రోహిత్ షాకింగ్ డెసిషన్.. ఆ పొజిషన్‌ను రాహుల్ కోసం త్యాగం చేసిన హిట్‌మ్యాన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరులో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి రావడంతో ఓపెనర్‌‌గా ఎవరు వస్తారు? అన్న ప్రశ్న తలెత్తింది. ఆ సందిగ్ధతకు రోహిత్ తెరదించాడు. రెండో టెస్టులో రాహులే ఓపెనర్‌ అని క్లారిటీ ఇచ్చాడు. గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ.. ఓపెనర్‌గా రాహులే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. తాను మిడిలార్డర్‌‌లో బ్యాటింగ్ చేస్తానని వెల్లడించాడు.

‘తొలి టెస్టులో జైశ్వాల్, రాహుల్ అద్భుతంగా ఆడారు. అలాగే, ఓవర్సీస్‌లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఓపెనర్‌గా కొనసాగడానికి అతను అర్హుడు. కాబట్టి, బ్యాటింగ్ ఆర్డర్‌‌‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదనిపించింది. నేను మిడిలార్డర్‌లో ఏదొక స్థానంలో బ్యాటింగ్ చేస్తా. బ్యాటర్‌గా ఇది నాకు కష్టమే. కానీ, జట్టుకు ఇదే బెస్ట్ ఆప్షన్. జట్టు విజయమే మాకు ముఖ్యం.’ అని తెలిపాడు.

రోహిత్ తీసుకున్న నిర్ణయం బ్యాటర్‌గా అతనికి అంత సులభమైనది కాదనే చెప్పాలి. ఓపెనర్‌‌గా 64 ఇన్నింగ్స్‌ల తర్వాత అతను మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. కెరీర్ ఆరంభంలో హిట్‌మ్యాన్ మిడిలార్డర్‌లోనే వచ్చాడు. 6వ స్థానంలో అతనికి మంచి రికార్డే ఉన్నది. 25 మ్యాచ్‌ల్లో 54.58 సగటుతో 1,037 రన్స్ చేశాడు. రెండో టెస్టులో 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు ఉన్నాయి.

Next Story

Most Viewed