ఆసీస్‌కు భారీ షాక్.. టీమ్ ఇండియా వన్డే సిరీస్‌ ముందు స్టార్ బౌలర్ ఔట్

by Vinod kumar |
ఆసీస్‌కు భారీ షాక్.. టీమ్ ఇండియా వన్డే సిరీస్‌ ముందు స్టార్ బౌలర్ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా వన్డే సిరీస్‌ ముందు ఆసీస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వన్డే జట్టుకు ఎంపికైన స్టార్ బౌలర్ జై రిచర్డ్ సన్ పిక్కకు గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆసీస్ క్రికెట్ అధికారికంగా ప్రకటించింది. అయితే రిచర్డ్ సన్ స్థానంలో నాథన్ ఇల్లీస్ ఆడనున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో గాయపడిన రిచర్డ్ సన్.. లోకల్ మ్యాచ్ ఆడుతుండగా మరోసారి గాయపడటంతో ఇండియా పర్యటనకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఐపీఎల్‌-2023కు కూడా దూరమయో పరిస్థితి వస్తుంది. ఈ సీజన్‌లో రిచర్డ్ సన్ ముంబాయి ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. మార్చి 17, 19, 22 ఇండియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఆసీస్ టీమ్‌లో రిచర్డ్ సన్ ఎంపికయ్యాడు.

Next Story

Most Viewed