మూడో వన్డేలో ఆ ప్రతిజ్ఞ చేద్దాం.. అభిమానులకు పిలుపునిచ్చిన జై షా

by Harish |
మూడో వన్డేలో ఆ ప్రతిజ్ఞ చేద్దాం.. అభిమానులకు పిలుపునిచ్చిన జై షా
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డేకు ముందు ఐసీసీ చైర్మన్ జై షా కీలక ప్రకటన చేశారు. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో తాము అవయవదానాన్ని ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని జై షా సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.‘ప్రజల్లో స్ఫూర్తినిచ్చే, వారిని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది. జీవితంలో గొప్ప బహుమతిని అందించే దిశగా ప్రతిఒక్కరూ అడుగు వేయాలని కోరుతున్నా.ఒక ప్రతిజ్ఞ, ఒక నిర్ణయం ఎన్నో జీవితాలను కాపాడుతుంది. మనం అందరం కలిసి మార్పు తెద్దాం.’ అని రాసుకొచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని బీసీసీఐ చేపడుతోంది. అందుకు సంబంధించి భారత స్టార్ ఆటగాళ్లతో ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.


Next Story