IPL 2023: ముంబైకి షాక్.. న్యూజిలాండ్‌కు జస్ప్రీత్ బుమ్రా!

by Mahesh |
IPL 2023: ముంబైకి షాక్.. న్యూజిలాండ్‌కు జస్ప్రీత్ బుమ్రా!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్ చేరుకున్నాడు. గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా.. శాస్త్ర చికిత్స చేయించుకోవడానికి అక్కడికి వెళ్లినట్లు సమాచారం అందుతుంది. కాగా వచ్చే రెండు రోజుల్లో బుమ్రాకు ఆపరేషన్ చేయనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే.. బుమ్రా.. త్వరలో జరగబోయే ఐపీఎల్ నుంచి తప్పుకునే చాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇలా జరిగితే.. ముంబై జట్టుకు భారీ దెబ్బ పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వార్తను విన్న బుమ్రా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. కాగా బుమ్రా చివరిసారిగా 2022 సెప్టెంబర్ నెలలో ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story