- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘చాలా బాధగా ఉంది’.. సర్ఫరాజ్‌కు క్షమాపణ చెప్పిన జడేజా
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ జడేజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఆటతో అనేక క్లిష్ట సమయాల్లో జట్టుకు అండగా నిలిచాడు. ఒకానొక దశలో జట్టును ఒంటిచేత గెలిపించిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అయితే.. ఇవాళ్టి టెస్టు మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో యంగ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే 62 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో జడేజా 99 పరుగులు చేసి సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో అనుకోకుండా జడేజా మూలంగా సర్ఫరాజ్ రన్ అవుట్ కావాల్సి వచ్చింది. దీంతో తన వల్లే అరంగేట్ర మ్యాచ్‌లో సర్ఫరాజ్ వెనుదిరిగాడని జడేజా మనసులో బాధ పెరిగిపోయింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దీనిపై జడేజా స్పందించారు. ‘చాలా బాధగా ఉంది. తప్పంతా నాదే.. నువ్వు చాలా బాగా ఆడావు’’ అని జడ్డూ స్టోరీ పెట్టారు. దీనికి క్రీడాభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటివి జరుగుతుంటాయి వదిలేయ్ భయ్యా అంటూ కొందరు జడేజాకు అండగా నిలుస్తుండగా.. జడేజా స్వార్థపరుడు అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.