- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ప్లాన్! పాంటింగ్ స్థానంలో భారత మాజీ ఆల్ రౌండర్?
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ కు ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ వ్యూహాలు మొదలుపెట్టాయి. ప్లేయర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ లోనూ భారీగా మార్పులు చేపడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ కోచ్ రికీ పాంటింగ్ పై వేటు వేసిన ఢిల్లీ, ఆ స్థానాన్ని భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తో భర్తీ చేయాలని చూస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా స్పోర్ట్స్ స్టార్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించి యువీ తో డీసీ యాజమాన్యం చర్చలు కూడా మొదలుపెట్టిందని తెలిపింది. అయితే దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా హెడ్ కోచ్ గా యువరాజ్ సింగ్ కు అనుభవం లేకపోయినప్పటికీ.. యువప్లేయర్లను తీర్చిదిద్దడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. శుభ్ మన్ గిల్, అభిషేక్ వర్మ వంటి ప్లేయర్లు యువీ వద్దనే శిక్షణ పొందడం గమనార్హం. కాగా మొదట్లో గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ గా యువీ పోటీలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2025 వేలాన్ని ఈ ఏడాది చివర్లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.