IPL-2024: ఐపీఎల్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు షాక్.. సీజన్ మొత్తానికి కీలక ఆటగాడు దూరం

by Shiva |
IPL-2024: ఐపీఎల్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు షాక్.. సీజన్ మొత్తానికి కీలక ఆటగాడు దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ టోర్నీ ఆరంభానికి ముందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల వేలంలో రూ.4 కోట్లకు సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ టోర్నీ మొత్తానికే దూరం కాబోతున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌-2024 నుంచి బ్రూక్‌ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హ్యారీ ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలపినట్లుగా సమాచారం. కాగా టీమిండియాతో టెస్టు సిరీస్‌ నుంచి సైతం బ్రూక్‌ ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున హ్యరీ బ్రూక్‌ ఐపీఎల్‌‌లోకి అడుగు పెట్టాడు. ఈ మేరకు వేలంలో ఆ జట్టు ఏకంగా రూ.13.23 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. అయినా, అతడు ఆశించిన స్థాయిలో రాణించలేదు. 11 మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో హ్యరీని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఐపీఎల్‌-2024కు ముందు అతడిని రిలీజ్ చేసింది. అనంతరం వేళంలో వచ్చిన హ్యారీ బ్రూక్‌ను రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

Advertisement

Next Story