Indonesia Masters 2023 badminton: ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన భారత యువ షట్లర్..

by Vinod kumar |
Indonesia Masters 2023 badminton: ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన భారత యువ షట్లర్..
X

జకార్తా : భారత యువ షట్లర్ కిరణ్ జార్జ్ ఇండోనేషియా మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇండోనేషియాలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో కిరణ్ 21-19, 22-20 తేడాతో జపాన్ ప్లేయర్‌కు తకాహషి‌పై విజయం సాధించాడు. రెండు సెట్లలోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్టే తలపడ్డారు. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న కిరణ్.. అద్భుతమైన పోరాటం చేశాడు. 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వరుసగా రెండు సెట్లను గెలుచుకుని విజేతగా నిలిచాడు. దాంతో కెరీర్‌లో 2వ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 100 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో కిరణ్‌కు ఇదే తొలి టైటిల్.

Advertisement

Next Story

Most Viewed