భారత పర్యటనకు సౌతాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు

by GSrikanth |
భారత పర్యటనకు సౌతాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా నడుస్తోంది. ఈ సీజన్‌లో హార్రర్ సినిమా మాదిరి ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన అనేక మ్యాచుల్లో చివరి బంతులే గెలుపోటములను డిసైడ్ చేశాయి. ఇక ఐపీఎల్ ముగియగానే T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమ్స్ అన్నీ తమ జట్లను ప్రకటించాయి. టీ20 ప్రపంచ కప్ అనంతరం టీమిండియా మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. తాజాగా ఈ సిరీస్ షెడ్యూల్ వెల్లడైంది. భారత పర్యటనలో దక్షిణాఫ్రికా 1 టెస్టు, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూన్ 16 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. జూన్ 28న ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూలై 5, 7, 9 తేదీల్లో టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్ కూడా బెంగళూరులోనే జరగనుంది.

Advertisement

Next Story