జూనియర్ హాకీ ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక

by Vinod kumar |
జూనియర్ హాకీ ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక
X

న్యూఢిల్లీ: ఈ నెల ఆఖర్లో ప్రారంభకాబోయే పురుషుల జూనియర్ ఆసియా కప్‌కు 18 మందితో కూడిన భారత హాకీ జట్టును హాకీ ఇండియా గురువారం ప్రకటించింది. జట్టుకు ఉత్తమ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. బాబీ సింగ్ ధామి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2021 జూనియర్ వరల్డ్ కప్‌లో పాల్గొన్న వారితోపాటు ఇటీవల సీనియర్ జట్టుకు అరంగేట్రం చేసిన వారితో బలమైన జట్టును ఎంపిక చేశారు. ఒమన్ వేదికగా మే 23 నుంచి జూన్ 1 వరకు టోర్నీ జరగనుంది. పూల్-ఏలో భారగ్ భాగమవ్వగా.. అదే గ్రూపులో పాకిస్తాన్, జపాన్, థాయిలాండ్‌ జట్లు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో మలేసియాలో జరగబోయే జూనియర్ వరల్డ్ కప్‌కు ఈ టోర్నీ క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా ఉన్నది.

జూనియర్ హాకీ జట్టు:

గోల్ కీపర్స్: మోహిత్, హిమ్వాన్ సిహాన్,

డిఫెండర్స్: శారదానంద్ తివారీ, రోహిత్, అమన్‌దీప్ లక్రా, అమీర్ అలీ, యోగెంబర్ రావత్

మిడ్‌ఫీల్డర్స్: విష్ణుకాంత్ సింగ్, రాజిందర్ సింగ్, పూవన్న, అమన్‌దీప్, సునిత్ లక్రా,

ఫార్వార్డ్స్: బాబీ సింగ్ ధామి(వైస్ కెప్టెన్), అరైజీత్ సింగ్ హుందాల్, ఆదిథ్య లాలగే, ఉత్తమ్ సింగ్(కెప్టెన్), సుదీప్ చిర్మాకో, అంగద్ బీర్ సింగ్.

Advertisement

Next Story