Indian Premier League 2023 schedule

by GSrikanth |   ( Updated:2023-03-24 14:44:17.0  )
Indian Premier League 2023 schedule
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) మరో వారం రోజుల్లో(మార్చి 31) ప్రారంభం కానుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సాదాసీదాగా జరిగిన ప్రారంభోత్సవం ఈసారి ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.ఐపీఎల్ 2023 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోటీపడుతుండగా.. మార్చి 31 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢీకొట్టబోతోంది.

లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు ఉండగా.. ఇందులో 18 డబుల్ హెడర్స్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉన్నాయి. టోర్నీలో పోటీపడే 10 జట్లూ సొంతగడ్డపై ఏడు మ్యాచ్‌లు, ప్రత్యర్థి సొంతగడ్డపై 7 మ్యాచ్‌లు ఆడతాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకి, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకి స్టార్ట్‌ అవుతాయి. మార్చి 31న ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా.. టోర్నీ ఆరంభమైన తొలి మూడు రోజుల్లోనే మొత్తం 10 జట్లు కనీసం ఒక మ్యాచ్ ఆడేస్తాయి. మే 21న ఐపీఎల్ 2023 సీజన్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది.




Indian Premier League 2023 schedule

https://epaper.dishadaily.com/3679312/TRENDING/Indian-Premier-League-2023-schedule#page/1/1

Advertisement

Next Story