- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమెన్స్ IPL వేలంలో అత్యధిక బేస్ ప్రైజ్‌తో భారతీయ క్రికెటర్లు
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేలం 13 ఫిబ్రవరి 2023 న జరగనుంది. కాగా ఈ ప్రారంభ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భారత్ తో పాటుగా విదేశీ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. కాగా..ఈ వేలంలో అత్యధిక బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలతో 10 మంది భారతీయ మహిళా ప్లేయర్లు ఉన్నారు. వారు వారు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్, స్నేహ రాణా మరియు మేఘన సింగ్. కాగా వీరితో పాటుగా మరో 14 మంది విదేశీ ప్లేయర్స్ కూడా.. అత్యధిక బేస్ ధర రూ. 50 లక్షలను కలిగి ఉన్నారు.
ఈ మహిళల T20 లీగ్‌లో 400 మంది క్రీడాకారులు వేలం ప్రక్రియలో పాల్గొంటారు. మొదటి సీజన్‌లో ఐదు జట్లు ఒకదానితో ఒకటి పోటీపడతాయి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) నేటి వేలం గురించి అధికారిక వివరాలు విడుదల చేయనుంది. ఈ రోజు సాయంత్రం ముంబైలో ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఐదు జట్లు అయినా.. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ పాల్గొననున్నారు. కాగా ఈ WPL వేలాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.