మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు ఎన్‌సీఏలో భారత జట్టుకు నైపుణ్య శిబిరం

by Harish |
మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు ఎన్‌సీఏలో భారత జట్టుకు నైపుణ్య శిబిరం
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెల 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో 10 రోజులపాటు నైపుణ్య శిబిరంలో పాల్గొననున్నది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మందితో కూడిన పూర్తి జట్టుతోపాటు రిజర్వ్ ప్లేయర్లు కూడా ఈ స్కిల్ క్యాంప్‌లో పాల్గొంటారు.

గాయాల బారిన పడిన వికెట్ కీపర్ యాస్తికా భాటియా, ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ ఇటీవల ఫిట్‌నెస్ టెస్టు‌ను క్లియర్ చేశారు. నైపుణ్య శిబిరంలో పాల్గొనేందుకు ఎన్‌వోసీ కూడా పొందినట్టు తెలుస్తోంది. ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడనుంది. హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పర్యవేక్షణలో ఈ స్కిల్ క్యాంప్‌ జరగనుంది. శిబిరం అనంతరం ప్లేయర్లకు నాలుగు రోజులపాటు విశ్రాంతినివ్వనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 24న యూఏఈకి వెళ్లేందుకు ముంబైలో సమావేశం అవుతారని సమాచారం. ప్రపంచకప్‌లో అక్టోబర్ 4న భారత జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed